Eto Vellipoyindhi Manasu : అటు అత్త ప్లాన్.. ఇటు భర్త మాజీ లవర్ కొత్త స్కెచ్!
on Oct 15, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -226 లో... సీతాకాంత్ ముందు నందిని నటిస్తుంది. ఇక నిన్ను బాధపెట్టనని నందిని వెళ్లిపోతుంటే సీతాకాంత్ తన చెయ్యి పట్టుకొని ఆపుతాడు. నువ్వు ఎక్కడికి వెళ్లనవసరం లేదు.. ఇక్కడే ఉండు కలిసి వర్క్ చేద్దాం.. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను.. ఇక మనం బిసినెస్ పార్టనర్స్ కాకుండా మంచి ఫ్రెండ్స్ కూడా అని సీతాకాంత్ అనగానే.. వద్దు సీతా మళ్ళీ ఏదైనా జరిగితే నన్ను అనుమానిస్తావని నందిని అంటుంది. అలాంటిదేం లేదని సీతాకాంత్ అంటాడు. దాంతో ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు.
పానీగ్రహం అయింది ఇక పెళ్లి ఒకటే మిగిలి ఉందని నందిని తన మనసులో అనుకుంటుంది. మరొకవైపు సీతాకాంత్ ఫొటోస్ చూస్తు ఉంటుంది రామలక్ష్మి. సీతాకాంత్ కి ఎన్ని సార్లు ఫోన్ చేసినా కట్ చేస్తుంటాడు. ఆ తర్వాత సీతాకాంత్ ఓ ఎంప్లాయిని పిలిచి.. ఈ ఫైల్ లో ఏంటి ఇన్ని మిస్టేక్స్ ఉన్నాయంటూ తిడతాడు. అప్పుడే మేనేజర్ వచ్చి.. మీకు చెప్పడం మర్చిపోయాను సర్ ఆల్రెడీ రామలక్ష్మి మేడమ్ మిస్టేక్స్ లేకుండా ఫైల్ ప్రిపేర్ చేసి పంపించింది.. మేడమ్ చాలా గ్రేట్ మీకు మాట రాకుండా చూస్తుందని చెప్తాడు. ఆ తర్వాత రామలక్ష్మి ఒక వీడియో పంపిస్తుంది. సీతాకాంత్ కాల్ చేసి లోపల ప్రేమ ఉన్నా బయటకు కోపంగా మాట్లాడుతాడు. భోజనం తీసుకొని రా అని చెప్తాడు. ఆ తర్వాత రామలక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతూ మా అయన లంచ్ తీసుకొని రమ్మన్నాడని శ్రీవల్లి, శ్రీలతలకి చెప్తుంది. చూసారా అత్తయ్య బావగారు లంచ్ తీసుకొని రమ్మన్నాడంట అని శ్రీవల్లి అనగానే.. అది తీసుకొని వెళ్లకుండా నేను ప్లాన్ చేస్తానుగా అని శ్రీలత అంటుంది.
ఆ తర్వాత డాక్టర్ ఇంటికి వస్తుంది. రామలక్ష్మి దగ్గరికి వచ్చి సీతాకాంత్ కి సంబంధించిన కొన్ని రిపోర్ట్స్ ఇచ్చి ఒక విషయం చెప్పాలి.. నువ్వు సీతాకాంత్ కి కొన్ని రోజులు దూరం ఉండాలి. నువ్వు పొరపాటు నా దగ్గర అయిన ఆయనకి ప్రాబ్లమ్.. ఈ విషయం అతనికి చెప్పొద్దనగానే రామలక్ష్మి షాక్ అవుతుంది. డాక్టర్ వెళ్లిపోతు శ్రీలతకి సక్సెస్ అంటు సైగ చేసి వెళ్తుంది. ఆ తర్వాత శ్రీలత నందినికి ఫోన్ చేసి ఇలా ప్లాన్ చేసానని చెప్తుంది. గుడ్ నేను కూడా ఇక్కడ సీతాని నా వైపుకి తిప్పుకోవాలని ట్రై చేస్తున్నానని నందిని అంటుంది. ఆ తర్వాత నందిని సీతకాంత్ దగ్గరికి భోజనం తీసుకొని వెళ్లి.. కలిసి తిందామని అంటుంది. దాంతో సీతాకాంత్ సరే అంటాడు. ఇద్దరు కలిసి సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read